ఆరోగ్యానికి మంచిదని.. మంచినీళ్లు ఎక్కువగా తాగితే అది కూడా ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ఎక్కువగా నీటిని.. అదే పనిగా తాగుతూ ఉంటే కిడ్నీలపై ఎక్కువ పని భారం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అతిగా తాగే నీటి వల్ల కిడ్నీలు వేగవంతంగా పని చేయాల్సి ఉంటుందని, తద్వారా కిడ్నీలపై భారం పడి.. అనారోగ్యానికి గురికాక తప్పదనివైద్యులు హెచ్చరిస్తున్నారు.
అందుకే మహిళలు రోజుకు 8 గ్లాసుల నీళ్లు.. పురుషులు 12 గ్లాసుల నీటిని తాగితే సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, రోజుకో యాపిల్ తీసుకోవడం ద్వారా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయని, ఒమెగా ప్యాటియాసిడ్లు అధికంగా ఉండే చేపలు కిడ్నీల పనితీరును మెరుగు పరుస్తాయి. వీటితోపాటు కిడ్నీల పనితీరును పెంపొందించేందుకు గుమ్మడి గింజలు, పుచ్చకాయ, ఎర్రటి ద్రాక్ష, స్ట్రాబెరీలు కూడా బాగా సహకరిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.