ఏపీలో ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వేసే మాస్టర్ ప్లాన్ లకు అధికారంలో ఉండే టీడీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఆ జిల్లాలో ఒక్కటి అంటే ఒక్కటి సీటు కూడ గెలవలేదు. అంతలా జగన్ పై ఆ జిల్లా ప్రజలు నమ్మకంగా ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో కూడ జగన్ ను నిలబెట్టిన జిల్లా కూడ అదే..అంతేకాదు అత్యదిక ఎమ్మెల్యే సీట్లు గెలిచింది..ఇద్దరు ఏంపీలను గెలిపించింది ఆ జిల్లానే. ఆ జిల్లా ఏమీటంటే అదే మన రాయలసీమలో ఉండే కర్నూలు జిల్లా. ప్రస్తుతం ఆ జిల్లా గురించి ఓ వార్త హల్ చల్ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఏంపీ అభ్యర్ధిగా ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుకే పోటీ చేస్తుందని ఈమధ్యే నారా లోకేష్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీనే అభ్యర్ధిని ముందుగా ప్రకటించినపుడు ప్రతిపక్ష వైసీపీ కూడా అభ్యర్ధి విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
కర్నూలు ఎంపి అభ్యర్ధిగా వైసీపీ తరపున బివై రామయ్య పోటీ ఖాయం అయినట్టు జిల్లాలో చర్చ మొదలైంది. ఈ ప్రశ్ననే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముందు జిల్లా నేతలు ప్రస్తావించారట. దీంతో జగన్ కూడా పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త బివై రామయ్య విషయంలో సానుకూలంగా స్పందించారట. దాంతో బివై పోటీ ఖాయమని ప్రచారం మొదలైంది. గత ఎన్నికల్లో వైసిపి తరపున పోటీ చేసిన బుట్టా కేవలం వైసీపీ పార్టీ జెండా పైనే గెలిచారు. టీడీపీ, కాంగ్రెస్స్ లో కెయి ఫ్యామీలీ..భూమా ఫ్యామీలీ…టీజీ ఫ్యామీలీ..మరియు కోట్ల ఫ్యామీలీ ఇంతమంది సీనియర్ల్ ఉన్న..కేవలం ఒక పారిశ్రామికవేత్త..అసలు జిల్లా ప్రజలకు ఎవరు తెలియని బుట్టా రేణుకేనే వైఎస్ జగన్ గెలిపించారు. అంటే కర్నూల్ జిల్లాలో జగన్ రేంజ్ ఏంటో తెలుస్తుంది. అయితే గెలిచిన కొంతకాలానికే బుట్టా రేణుక టీడీపీలోకి ఫిరాయించారు. దాంతో బుట్టాపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. అదే సమయంలో టీడీపీలోని సీనియర్ నేతలు కూడా బుట్టాను కలుపుకోవటం లేదు. దీంతో కర్నూల్ లో బుట్టా రేణుక గెలిచేది లేదన్నది అర్ధమైపోతోంది.