శృంగారం అనేది అటు శరీరం, ఇటు మనస్సు సంతృప్తి చెందాలంటే శృంగారం ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ సెక్స్ అనేది బలవంతంగా చేసేది కాదు. అలాగే, సంభోగం జరిగే సమయంలో అసంతృప్తిని కలిగిస్తే మాత్రం భాగస్వామిని నిరుత్సాహ పడవచ్చు. మగవారిలో శృంగార సామర్ధ్యం ఎక్కువగా ఉంటేనే భాగస్వామిని సంభోగ సమయంలో సంతృప్తి పెట్టవచ్చు. అయితే, కొంత మంది శృంగారం చేసే సమయంలో తొందరగా ఔట్ అవుతుంటారు. అలాంటి వారు ఏం చేయాలి..? ఏం చేస్తే శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనవచ్చు..?
చాలా మంది మగవారు వారి శృంగార సామర్ధ్యం తగ్గిపోవడం వల్ల సతమతమవుతుంటారు. శృంగార సమయంలో మగవారి పాత్ర ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా తొందరగా ఔట్ అయ్యే వారు కొన్ని పద్ధతులను పాటిస్తే సరిపోతుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు కొన్ని సాధనలు చేయాలి. స్ర్కీజింగ్ టెక్నిక్స్ ఫాలో కావాలి. హస్త ప్రయోగం చేసుకుంటూ స్కలన సమయం వచ్చే సరికి అంగం చివరన నొక్కి.. స్కలనాన్ని ఆపివేసే టెక్నిక్‌ను సాధన చేయండి. ఈ సాధన చేయడం వలన మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.
అలాగే, తొందరగా ఔట్ కాకుండా ఉండాలంటే ఆలోచనలను నియంత్రణ చేసుకోవాలి. ఈ విధానం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే, శృంగారం చేసే సమయంలో భావ ప్రాప్తికి చేరే సమయంలో మీ శరీరంలో ఏం జరుగుతుందో.. ఆ దశను నియంత్రించండి. మీరు శృంగారం చేసే సమయంలో ఎక్కువగా ఆతృత పొందుతున్నట్లయితే ఆ ఆతృతను కొద్దిగా తగ్గించుకోవాలి. శృంగారం చేసే సమయంలో ముద్దులు పెట్టుకోవడం సహజం. అయితే, మామూలుగా పెట్టడం కన్నా.. కాస్త ఆవేశంగా ముద్దులు పెడతారు. అలా అస్సలు చేయవద్దు. ఇలా చిన్న చిట్కాలను పాటిస్తే చాలు.. శృంగారం ఎక్కువ సేపు చేసే అవకాశం ఉంటుందని సెక్సాలజిస్ట్‌లు చెబుతున్నారు.