ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.. ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ తొమ్మిది పధకాలు ప్రకటించినప్పటి నుండి అధికార టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీనికి తోడూగా గత 210 రోజులుగా అలుపనేది లేకుండా చేస్తున్న పాదయాత్ర విజయవతం కావడం జగన్ కు మరింత బలం వచ్చింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఇతర పార్టీల నేతలు వైసీపీలోకి క్యూ కట్టగా.. అధికార తెలుగుదేశం పార్టీలోని నేతలు కూడా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా పరవాడ మండలం సాలాపువానిపాలెంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాల వారు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వైసీపీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ చంద్రబా బు పాలనతో విసిగిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారన్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోకవర్గ ఇన్‌చార్జ్ వరుదు కల్యాణి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులు, సామాన్యులు దగా పడ్డారన్నారు. పెందుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ అన్నంరెడ్డి అదీప్‌రాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు టీడీపీతో విసిగిపోయి తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
వైసీపీ గ్రామ అధ్యక్షుడు సాలాపు నానాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు, జన్మభూమికమిటీ సభ్యుడు సాలాపు అప్పారావు, మాజీ ఉప సర్పంచ్ సాలాపు కనకరాజు, వార్డు సభ్యుడు సాలాపు నూకరాజు, లారీ ఓనర్లు సాలాపు శ్రీనివాసరావు, నానాజీ, రామకృష్ణ, అప్పలనాయుడు, బాబూరావుతో పాటు 50 కుటుంబాలకు చెందిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోపక్క వైఎస్ జగన్ నాయకత్వం మీద విశ్వాసంతో బక్కన్నపాలెం మాజీ ఉపసర్పంచ్ ఆర్. స్వామినాయుడు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు తైనాల విజయకుమార్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఆయనతో పాటు 150 మంది అనుచరులు చేరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా కార్యదర్శి ఇల్లపు ప్రసాద్, పెందుర్తి నియోజకవర్గం నాయకులు పైలా శ్రీనివాసరావు, 56వ వార్డు పార్టీ అధ్యక్షుడు జి.పూర్ణానందశర్మ (పూర్ణ), పరవాడ మండల అధ్యక్షుడు సిరపురపు అప్పలనాయుడు, పరవాడ సర్పంచ్ చుర్కా రామునాయుడు, నాయకులు సుందరపు అప్పారావు, పచ్చికోరు రమణమూర్తి, సేనాపతి గంగరాజు తదితరులు పాల్గొన్నారు.