ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 214వ రోజు షెడ్యూల్ ఖరారైంది. ప్రస్తుతం వైఎస్ జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్నారు. జగన్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. వైఎస్ జగన్ మంగళవారం ఉదయం పెద్దపూడి మండలం కరకుదురు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అచ్యుతాపురం చేరుకున్న తర్వాత జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం రామేశ్వరం మీదుగా కొవ్వాడ వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
