ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్ ప్రజల మంచి కోసం పరితపించే వ్యక్తని, పేదల సంక్షేమం కోసం పాటుపడే గుణమని, రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలనే పట్టుదల వైఎస్ జగన్ను వేల కిలోమీటర్లు నడిచేలా చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాన్నివ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలోనే తమ సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ను ప్రజలు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు.
ఇదిలా ఉండగా, వైఎస్ జగన్కు ప్రజల్లో ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. పాదయాత్రలో వైఎస్ జగన్ను ప్రజలు ఆదరిస్తున్న తీరే అందుకు నిదర్శనమని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు. వైఎస్ జగన్ అడుగు పెట్టిన ప్రతీ పల్లెలో, ప్రతీ పట్టణంలో ఆయనకు అపూర్వ స్వాగతం లభిస్తోందని వైసీపీ నేతలు, అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే, వైఎస్ జగన్ పాదయాత్ర ఇవాళ తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో ప్రారంభమైంది. తమ సమస్యలను తెలుసుకునేందుకు జగన్ వస్తున్నాడని తెలుసుకున్న గొల్లలమామిడి ప్రజలంతా ఏకమై రెండు కిలోమీటర్ల మేర పొడవైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాతో .. జగన్కు స్వాగతం పలికారు. గొల్లల మామిడిలో జగన్ పాదయాత్రతో చేస్తున్న సమయంలో జై జగన్ అంటూ నినదించారు.