గత ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ తరపున పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి గెలుపొంది ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన తాయిలాలకు ,ప్రలోభలాకు లొంగి పసుపు కండువా కప్పుకున్నారు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ..
తాజాగా ఆమె ఒక భూవివాదంలో భాగంగా కుటుంబసభ్యులతో వాగ్విదానికి దిగి ఒక ఎమ్మెల్యే అనే సంగతి మరిచి మరి కింద పడుతూ..లేస్తూ ఒకరి జుట్టు ఒకరు లాక్కుంటూ కొట్టుకున్న వీడీయో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా ,ప్రింట్ అండ్ ఎలక్ట్రానికి మీడియాలో వైరల్ అవుతుంది.
అసలు విషయానికి వస్తే ఎమ్మెల్యే ఈశ్వరీ తన సొంత గ్రామమైన కుమ్మరిపుట్టులో తన వదిన అయిన గిడ్డి విజయలక్ష్మీ దగ్గర రూ.రెండు లక్షలకు భూమిని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు.అంతే కాకుండా ధాన్యం నిల్వచేయడానికి ఒక గదిని నిర్మించే క్రమంలో ఆమె వదిన విజయలక్ష్మీ తన మధ్య గొడవ జరిగింది.ఈ క్రమంలో వారిద్దరూ ఒకరిపై ఒకరు మాటలు జారుకున్నారు.అక్కడితో ఆగకుండా ఒకర్ని ఒకరు నెట్టుకుంటూ కింద పడ్డ కానీ ఒక ఎమ్మెల్యే అనే సంగతే మరిచిపోయి జుట్టు లాక్కుంటూ మరి కొట్టుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది..