వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 213వ రోజుకు చేరుకుంది. కాగా, చంద్రబాబు సర్కార్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పాదయాత్ర చేస్తున్న జగన్ వెంట తాము కూడా అంటూ ప్రజలు అశేష సంఖ్యలో ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొంటున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు అర్జీల రూపంలో తెలియజేస్తున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు జగన్‌ను కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
సంఘమిత్ర, వీఓఏ, వెలుగు యానిమేటర్స్‌పై వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. యానిమేటర్స్ రూ.5వేలుఇవ్వాలని విజ్ఞప్తి చేయగా.. రూ.10వేలు జీతం ఇస్తామని మహిళల కరతాల ధ్వనుల మధ్య వైఎస్ జగన్ ప్రకటించారు. జీ.మామిడాల పాదయాత్ర శిబిరంలో ఉన్న వైఎస్ జగన్‌ను యానిమేటర్స్ ప్రజలు కలుసుకున్నారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వైఎస్ జగన్ ముందు ఏకరువు పెట్టారు.
వారి సమస్యలను విన్న వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మహిళలు సంతోషంగా ఉంటేనే..సమాజం బాగుంటుందని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పిన మాటలను గుర్తు చేశారు. మహిళలు ఆనందంగా, సంతోషంగా ఉండటమే వైఎస్ఆర్ కాంగ్రెష్ పార్టీ లక్ష్యమన్నారు. మహిళలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, సంఘమిత్రా, వీవోఏ, వెలుగు యానిమేటర్స్ కు నెలకు రూ.10వేలు జీతం ఇస్తామని ప్రకటించారు.