ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. గత 4 సవత్సరాలుగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో తీవ్రవ్యతీరేకత రావడంతో వైఎస్ జగన్ వైపూ అందరి చూపు మళ్లింది. అంతేకాదు నవరత్నాలు…పాదయాత్రలో ప్రజలకు, ఉద్యోగులకు, యువకులకు,రైతులకు ఇలా అందరికి న్యాయం చేస్తా అని గట్టి హామీ ఇవ్వడంతో వైసీపీలోకి వీపరీతంగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ టీడీపీ ఎమ్మెల్యే అబ్ధుల్ ఘని వైసీపీలో చేరనున్నారు అని వార్తలు వస్తున్నాయి.అబ్దుల్ఘని హిందూపురం నుండి 2009లో టీడీపీ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.అయితే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఆయన తన సీటు త్యాగం చేసి ప్రముఖ సినీ హీరో,ప్రస్తుత ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అవకాశమిచ్చారు.అయితే వచ్చే ఎన్నికలపై ఆయనకి సీటు ఇవ్వడం కష్టమని టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పడంతో ఆయన స్తబ్ధుగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా బాలకృష్ణ పోటీ చేస్తే తనకు సీటు లేకపోవడంతో ప్రస్తుతం ఆయన వైసీపీలో చేరనున్నట్లు జిల్లా టీడీపీ నేతలు వ్యాఖ్యనిస్తున్నారు
