ఆమె సౌత్‌లో స్టార్ హీరోయిన్ పెళ్లైనా ఏ మాత్రం తగ్గని ఫ్యాన్ ఫాలోయింగ్. దానికి తోడు వరుసగా సూపర్ హిట్స్. తన ముందు క్యూ కడుతున్న ఆఫర్స్. ఏ హీరోయిన్‌కైనా ఇంతకంటే ఇంకేం కావాలి..? ఇంత బిజీ సమయంలో కూడా తనవంతు సోషల్ సర్వీసులు చేస్తోంది మిసెస్ సమంత నాగ చైతన్య. సోషల్ సర్వీస్ చేస్తూ తనకు తానే పోటీ అని నిరూపించుకుంటోంది.
తెలుగు, తమిళ భాషల్లో సమంత టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. దక్షిణాధి భాషల్లోనూ ఆమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. నటన విషయంలోనే కాదు.. వ్యక్తిత్వం విషయంలోనూ ఆమెను వాళ్లంతా ఎంతో అభిమానిస్తుంటారు. ఎంత బిజీలో ఉన్నప్పటికీ సమాజ సేవకు కూడా ఆమె సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలంటే సమంతకు చాలా ఇష్టం.
అనారోగ్యంతో బాధపడుతున్న చిన్న పిల్లలకు సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. అలా చాలా మంది చిన్నారుల జీవితాల్లో సామ్ వెలుగులు నింపుతూ వస్తోంది. తాజాగా ఆమె 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఫోనాక్ అనే సంస్థకు వెళ్లింది. వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారుల సమస్యలను తీర్చే ఈ సంస్థకు వెళ్లిన సమంత.. వినికిడి లోపంతో బాధపడుతున్న పది మంది చిన్నారులకు వినికిడి యంత్రాలను అందించారు. భవిష్యత్‌లోనూ ఫోనాక్ సంస్థకు తనవంతు సహాయం అందుతుందని సమంత చెప్పింది.