సాకర్ ప్రపంచకప్ అంతిమ సంగ్రామం ముగిసింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ ఫిఫా విజేతగా నిలిచింది. తిరుగులేని ప్రదర్శనతో ఆ జట్టు ప్రపంచకప్ 2018 విజేతగా నిలిచింది. గోల్స్ మోత మోగించిన ఫ్రాన్స్ ఆదివారం జరిగిన ఫైనల్లో 4-2తో క్రొయేషియాను మట్టికరిపించింది. చరిత్రలో రెండో సారి కప్పును అందుకుంది. ఫ్రాన్స్ ఇంతకుముందు 1998లో ప్రపంచకప్ సాధించింది. తొలిసారి ఫైనల్‌కు దూసుకొచ్చిన చిన్న దేశం క్రొయేషియాకు షాక్ ఇచ్చింది. 4-2 తేడాతో ఆ జట్టును మట్టికరిపించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 18వ నిమిషంలో ఫ్రాన్స్‌కి వచ్చిన ఫ్రీకిక్లో క్రొయేషియా స్ట్రైకర్ మారియో సెల్ఫ్ గోల్ చేయడంతో ఫ్రాన్స్ ఖాతా తెరిచింది. 28వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు పెరిసిచ్ గోల్ కొట్టి స్కోరును 1-1తో సమం చేశాడు. 38వ నిమిషంలో ఫ్రాన్స్‌కు వచ్చిన పెనాల్టీ అవకాశాన్ని గ్రీజ్మన్ గోల్‌గా మలిచి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 2-1కి పెంచాడు.ఫస్ట్ హాఫ్‌లో ప్రత్యర్థి జట్టు గోల్‌పోస్ట్‌పై క్రొయేషియా ఏడుసార్లు దాడిచేసింది.
సెకండాఫ్‌లో ఫ్రాన్స్ దూకుడు పెంచింది. మ్యాచ్ 59, 65 నిమిషాల్లో పోగ్బా, ఎంబపె గోల్స్ చేసి తమ జట్టుకు తిరుగులేని ఆధిక్యతను అందించారు. 69వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు మండుజుకిచ్ గోల్ చేసి ఫ్రాన్స్ ఆధిక్యతను 4-2కు తగ్గించాడు. ఈ తరుణంలో అవకాశాలు వచ్చినా.. ఒత్తడిని తట్టుకోలేక క్రొయేషియా చేజార్చుకుంది. మ్యాచ్ ముగిసేసరికి ఇరు జట్లూ మరో గోల్ చేయకపోవడంతో ఫ్రాన్స్ విజేతగా నిలిచింది.