అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో జరిగిన కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాకు చెందిన స్టూడెంట్ శరత్ చనిపోయిన విషయం తెలిసిందే. కేన్సస్ లో కాల్పులు జరిపిన నిందితుడి ఫొటోలను పోలీసులు విడుదల చేశారు . ఈ కేసు విచారణలో భాగంగా.. నిందితుడు ఓ ఇంట్లో ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు.
ఆ వెంటనే చుట్టుముట్టారు. అయితే పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డాడు నిందితుడు. పోలీసులు కూడా ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఈ ఘటనలో శరత్ ను చంపిన నిందితుడు చనిపోయాడు. ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. నిందితుడు ఫొటోలను మాత్రమే విడుదల చేశారు.. అతని పూర్తి వివరాలను ఇప్పటి వరకు బయటపెట్టలేదు.