Home / ANDHRAPRADESH / వైసీపీలోకి దాస‌రి కుటుంబం.. డేట్ ఫిక్స్‌.!

వైసీపీలోకి దాస‌రి కుటుంబం.. డేట్ ఫిక్స్‌.!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో ఏపీ వ్యాప్తంగా రాజ‌కీయ రంగు పులుముకుంది. మ‌రో ప‌క్క రాజ‌కీయ పార్టీల అధినేత‌లు సైతం 2019 ఎన్నిక‌ల కోసం అస్ర్త‌శ‌స్ర్తాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీల‌ ప‌రిస్థితి ఏమిటి..? అభ్య‌ర్థుల బ‌ల‌మెంత‌..? గెలుస్తారా..? ఓడ‌తారా..? గెలుపుకు ఏం చేయాలి..? అనే అనే రీతిలో స‌ర్వేల‌తో బిజీ.. బిజీగా గ‌డుపుతున్నారు. ప్ర‌తి పార్టీ అధినేత 2019 ఎన్నిక‌లే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆ క్ర‌మంలోనే అధికార పార్టీ స‌హా ప్ర‌తిప‌క్షాలు ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని మొద‌లు పెట్టాయి.

మ‌రోప‌క్క ఎన్నిక‌ల స‌ర్వే ఏజెన్సీలు సైతం రంగంలోకి దిగాయి. ఏపీలోని ప్ర‌తీ ప్రాంతాన్ని క‌లియ తిరిగి ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను సేక‌రిస్తున్నాయి. 2019 రాజ‌కీయ పార్టీల భ‌విష్య‌త్‌ను తేల్చే ప‌నిలో ప‌డ్డాయి. జాతీయ, అంత‌ర్జాతీయ స‌ర్వే స్థాయిలో పేరుగాంచిన స‌ర్వేల‌న్నీ అందులో భాగ‌మే. అయితే, రిప‌బ్లిక‌న్ టీవీ స‌ర్వే, ఆర్ఎస్ఎస్ స‌ర్వే, రాహుల్ గాంధీ స‌ర్వే, ఎన్డీ టీవీ స‌ర్వే, ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ దిన‌ప‌త్రిక సంస్థ స‌ర్వే, ఏపీ ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వేల ఫ‌లితాలు గతంలో వెలువ‌డిన విష‌యం తెలిసిందే. అయితే, పై స‌ర్వేల‌న్నీ కూడా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తేల్చేశాయి. ఈ నేప‌థ్యంలో ప‌లు సీనియ‌ర్ పార్టీల రాజ‌కీయ నేత‌లు ఇప్ప‌టికే వైసీపీలో చేర‌గా.. మ‌రికొంద‌రు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో, కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం టీడీపీ సీనియ‌ర్ నేత దాస‌రి వెంక‌ట బాల వెంక‌ట వ‌ర్ధ‌న‌రావు త‌న కుటుంబ స‌మేతంగా వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారనే వార్త‌లు సోష‌ల్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కాగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన దాస‌రి రెండుసార్లు గెలుపొందారు. అయితే, ఏపీలో మారిన‌ రాజ‌కీయ ప‌రిస్థితుల దృష్ట్యా దాస‌రి వెంక‌ట బాల వ‌ర్ధ‌న్‌ను టీడీపీ కేడ‌ర్ ప‌క్క‌న పెట్టేసింద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో సైకిల్‌కు గుడ్‌బై చెప్పి త‌న కుటుంబంతో స‌హా వైసీపీలో చేరేందుకు దాస‌రి నిర్ణయించుకున్నార‌ని, అందులో భాగంగానే త‌న అనుచ‌ర వ‌ర్గంతో చ‌ర్చ‌లు కూడా జ‌రిపార‌ట‌. అయితే, జ‌గ‌న్ పాద‌యాత్ర విశాఖ‌కు చేరుకోగానే దాస‌రి వెంక‌ట బాల వ‌ర్ధ‌నరావు వైసీపీలో చేరనున్నార‌ని సోష‌ల్ మీడియా క‌థ‌నం పేర్కొంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat