ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ పార్టీ మ్యానిఫెస్టోలో ఓ ప్రతిష్టాత్మక పధకం అన్న క్యాంటీన్ : . అధికారంలోకొచ్చి నాలుగేళ్లు గడిచే వరకు ఆ ఊసే ఎత్తకుండా ఆటకెక్కించిన పధకం . మరలా ఎన్నికలు దగ్గరికొచ్చే సమయంలో హఠాతుగా గుర్తుకొచ్చిన పధకం . ఇన్నాళ్లు పట్టని సామాన్యుని ఆకలి ఘోష ఈ చివరి రోజుల్లో ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడుకోవటానికి గుర్తు తెచ్చుకొని హడావుడిగా ప్రారంభించిన పధకం .
సరే చివరి రోజుల్లో అయినా సామాన్యుని ఆకలి తీరే ఓ మంచి పధకం ప్రారంభించారు అని సంతోషించాలో ఆకలి గొన్న అభాగ్యులకు కేటాయించిన సొమ్ములో కూడా అరవై ఆరు పైసలు వంతు అగ్రభాగం మింగిన పందికొక్కులు వంటి అధికార పార్టీ నేతల్ని కాంట్రాక్టర్లని చూసి ఏడవాలో తెలియని దుస్థితి అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి సంబంధించిన సోషల్ మీడియాలో అభిమానులు అవేదన..వాళ్ళు ఏమన్నారో ఒక లుక్ వేద్దామా..
ఘనత వహించిన టీడీపీ కాంట్రాక్టర్స్ ఇసుక పిండి తైలం ఎలా పిండారో లెక్క వేద్దాం రండి .
రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన అన్న కాంటీన్స్ : 60
ఒక్కో కాంటీన్ కి సాంక్షన్ చేసిన మొత్తం : 38 లక్షలు
ఖర్చు చూద్దామా :
స్థలం ప్రభుత్వ స్థలమే ఉచితం : 40 ×40 sft
2 అడుగుల బేస్ హైట్
ఓపెన్ స్పేస్ : చుట్టూ 5 sft
బిల్డింగ్ కట్టుబడి : 28.5 ×28.5 = 812 sft
ఇంటీరియర్ : 2 సర్వింగ్ ప్లాట్ ఫార్మ్స్
2 వాష్ రూమ్స్ , వెస్ట్రన్ కమోడ్ తో
9 లాంగ్ బాడీ టాప్స్
40 ×40 స్పేస్
30 × 30 బిల్డింగ్
14 cfl బుల్బ్స్
2 ss సింక్స్ ,
ప్లంబింగ్ , ఎలక్ట్రికల్ మెటీరియల్
8 ఫాన్స్ 1440 ఆర్పీఎం
12 స్మార్ట్ ట్యూబ్ లైట్స్
27 . 27 టోటల్ ఇన్నర్
208 ft గ్లాస్ 8 mm హ్యాండిల్స్ , స్పెర్స్
3 no 4×7 ఐరన్ డోర్స్ గోద్రెజ్ విత్ లాక్ , హ్యాండిల్
700 sft పార్కింగ్ రెడ్ టైల్స్
700 sft 2×2 ప్లోర్ టైల్స్
లైట్ గ్రే వాల్ పెయింట్ లౌ క్వాలిటీ
800 ft అల్యూమినియం స్క్వేర్ ఫ్రెమ్
దానికి పెయింట్ మీడియం క్వాలిటీ
1 sft 5 ఫీట్ హైట్ పిల్లర్స్ సెక్యురిటి వాల్ పిల్లర్స్ 20
1520 ft హాఫ్ ఇంచ్ ఐరన్ ట్యూబ్ స్క్వేర్
800 వెల్డింగ్స్
టోటల్ ఔటర్ లో క్వాలిటీ వైట్ పెయింట్
ఎంట్రన్స్ 6 ఇంచ్ × 6 ఫీట్ స్టెప్స్ 4 నెంబర్
ఇందులో ఇసుక ఉచితమేనండోయ్ .
కిచెన్ లేదు , కప్ బోర్డ్స్ లేవు , అడుగు కూడా వుడ్ వర్క్ లేదు , లోపల పార్టీషన్స్ లేవు కాబట్టి 800 చదరపు అడుగులకు అడుక్కి సగటున 900 మించదు . పోనీ లాభాలతో కలిపి sft వెయ్యి రూపాయలు లెక్కేసుకొన్నా ఎనిమిది లక్షలు కన్నా కాదనేది ఏ సివిల్ ఇంజనీర్ ని అడిగినా ఘంటాపథంగా చెప్పే వాస్తవం .
ఇహ బయట చుట్టూ అడుగున్నర చొప్పున రేకులతో చేసిన డొల్ల ఫ్రేమ్ వాటికి వేసిన పార్టీ ఎల్లో కలర్స్ , కాంపౌండ్ పిల్లర్ , గ్రిల్స్ 2 ఫీట్ ఫౌండేషన్ , పార్కింగ్ టైల్స్ మొత్తం మూడు లక్షలు , ఓపెనింగ్ ఖర్చులు డెబ్భై వేలు , బాబు గారి సంప్రదాయం ప్రకారం ఇన్ టైంలో చేసినందుకు అదనపు లాభం పదిశాతం లెక్కేసి లక్షా ముప్పై వేలు ఇచ్చినా మొత్తం పదమూడు లక్షలు .
కానీ ప్రజాధనం దోచేయటంలో , దుర్వినియోగం చేయటంలో ఘనత వహించిన టీడీపీ ప్రభుత్వం ఒక్కో క్యాంటీన్ కి ఇచ్చింది
ముప్పై ఎనిమిది లక్షలు .
ప్రభుత్వ కేటాయింపు ఒక్కో క్యాంటీన్ కి 38 లక్షల చొప్పున 60 క్యాంటీన్ లకు. 22.80 కోట్లు
వాస్తవిక అంచనా ఒక్కో క్యాంటీన్ కి 13 లక్షల చొప్పున 60 క్యాంటీన్ లకు. 7.80 కోట్లు
22.80 – 7.80 = 15 కోట్లు లెక్క తేలని అధికార పక్ష కాంట్రాక్టర్లు బొక్కి సొంత బొక్కసం నింపుకున్న ప్రజాధనం .
టీడీపీ ప్రభుత్వానికి ఇవే మా ప్రశ్నలు :
అన్న కాంటీన్ బిల్డింగ్ ప్లాన్ , ఎస్టిమేట్ , టెక్నికల్ సాంక్షన్ వివరాలు బహిర్గత పరచి మా ఆరోపణలు తప్పని రుజువు చేయగలరా ..అసలు ఎస్టిమేట్ వేయటానికి ap ssr రేట్స్ ఫాలో అయ్యారా ..బిల్డింగ్స్ కి థర్డ్ పార్టీ క్వాలిటీ టెస్ట్ చేయించి అప్రూవల్ అయ్యాయా .చెల్లించిన నిధులు , వర్క్ చేసిన సంస్థల వివరాలతో శ్వేత పత్రం ప్రకటించగలరా .
మా ఆరోపణల పై విచారణ జరిపించి నిజం అని తేలితే సంబంధిత మంత్రి , అధికారుల పై విచారణ జరిపించి శిక్షించగలరా .
లేకపోతే ఈ అవినీతిలో ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉందని మేమే కాదు ప్రజలు సైతం అర్థం చేసుకొంటారు .
అన్న క్యాంటీన్ ల విషయంలో ఇప్పటివరకు ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలేవి పరిశోధించని కోణంలో పరిశోధించి
“#TeamJaganKosam” మీకందిస్తున్న అసలైన ఎక్సక్లూజివ్ వివరాలివి .
మోసపూరిత టీడీపీ ప్రభుత్వ విషయంలో ప్రతి అంశాన్ని పరిశోధించి అవినీతి , అక్రమాలను బహిర్గతం చేసి మీకందించటంలో మీ ”
టీం జగన్ కోసం” ఎప్పుడూ ముందుంటుంది అని జగన్ ,వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తున్నారు..
For More Details:
Publiée par The Legend YSR – Leader YSJagan sur Dimanche 15 juillet 2018