ఏపీలో అధికార టీడీపీ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బయటకి వస్తున్నాయి.ఈ నేపథ్యంలో విజయవాడ టీడీపీ పార్టీ ఎంపీ కేశినేని నాని చేసిన తాజా వ్యాఖ్యలు ఆ పార్టీలో పెను సంచలనం రేకెత్తిస్తున్నాయి.నిన్న శనివారం కృష్ణా జిల్లా ఎ కొండూరులో ఎంపీ నాని పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా తిరువూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవీని ఎ కోండూరుకు కేటాయించాలని ఆ మండలానికి చెందిన నేతలు ,కార్యకర్తలు నానిని కోరారు.
ఈ సందర్భంగా ఎంపీ నాని రానున్న ఎన్నికల్లో మండలంలో టీడీపీ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుందని ఎంపీ పార్టీ నేతలను అడిగారు.మూడు వందల నుండి నాలుగు వందల వరకు వస్తుందని వారు బదులిచ్చారు.దీనికి సమాధానంగా ఎంపీ లేదు పదివేల మెజార్టీ తీసుకువస్తేనే ఇస్తాను అని తెల్చేశారు.ఎంపీ మాటలతో కంగు తిన్న నేతలు ,కార్యకర్తలు ఎంపీ వెళ్ళిన తర్వాత సమావేశం నిర్వహించుకున్నారు.
ఈ సమావేశంలో మండలంలో అత్యంత సీనియర్ నాయకుడు,మూడు సార్లు వరసగా మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి..రెండు సార్లు మండల పరిషత్ అధ్యక్ష పదవీని టీడీపీ గెలిచేలా చేసిన రమేష్ రెడ్డి ఈ సమావేశానికి నాయకత్వం వహించారు.ఈ సమావేశంలో మండలానికి చెందిన నేతలు,కార్యకర్తలు రమేష్ రెడ్డీతో కల్సి అందరూ పార్టీకి ముకూమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు ..దీంతో జిల్లాలో తిరువూరు నియోజకవర్గానికి టీడీపీకి ఆయుపట్టు అయిన ఎ కోండూరు మండలం అంతా టీడీపీ ఖాళీ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి అని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు ..