జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సమాజంపై అవగాహన లేదు, రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి పట్టదు, కనీసం ఉన్నత విద్యార్హత కూడా లేదు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే జనసేన పార్టీకి కూడా పట్టబోతోంది, ఇప్పటికే పవన్ చెంత తన సామాజికవర్గం సభ్యులే ఎక్కువ, ఇలా తన సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులే.. జనసేనలో ప్రస్తుతం నేతలుగా చెలామని అవుతున్నారు, ఇలాంటి నేతలు ఉన్న పార్టీని ప్రజలు ప్రోత్సహించరని నటి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
కాగా, ఇటీవల ఓ ప్రముఖ సోషల్ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేసే సమయంలో ప్రజలంతా ప్రస్తుత రాజకీయాలను ప్రస్పుటంగా గమనించాలని పిలుపునిచ్చింది. సినిమాల్లో ఒక్క డైలాగ్‌ను చెప్పేందుకు 20, 30 సార్లు బట్టీపట్టి మరీ చెప్పే వ్యక్తి ప్రజలను ఉద్దరిస్తాడంటే ఎవరు నమ్ముతారు..? అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. ఏదో ఒక సినిమా విజయం సాధించినంత మాత్రాన.. సినిమాకు రాజకీయాలను జోడిద్దామనుకుంటే అది మూర్ఖత్వమేనని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు.. సినిమాల్లో డైలాగ్‌లు చెప్పినట్టు.. రాజకీయ సభల్లో మాటలు చెప్పినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరని శ్రీరెడ్డి పేర్కొంది. ఏపీలోని ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన పార్టీ తరుపున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే.. తన అవగాహనా రాహిత్యం వల్ల కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలిచే అవకాశం లేదని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.