టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌పై సంచలన ఆరోపనలతో పెను దుమారం రేపిన నటి శ్రీరెడ్డి కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. మరో సారి మెగా ఫ్యామిలీపై పదునైన విమర్శలు సంధిసతూ.. ప్రశ్నల వర్షం కురిపించింది.
జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఎవరైనా విమర్శిస్తే.. వెంటనే అన్న నాగబాబు సీన్లోకి ఎంటరై.. మా వాడు వస్తాడు.. మీ అందరి గుడ్డలూడదీసి దుమ్ము దులుపుతాడు.. మీ అందర్నీ నాశనం చేస్తాడు.. ఒక్కొక్కడికి పడిపోతద్ది.. తడిసిపోతద్ది.. అంటూ బెదరింపులకు పాల్పడటం తన నీచ సంస్కృతిని తెలియజేస్తుందన్నారు. నీవు జీవితంలో హీరోగా రాణించలేకపోవడానికి కారణం.. నీ దురుసుతనమేనని నాగబాబును ఉద్దేశించి శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.