తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున బరిలోకి దిగే అభ్యర్థి ఖరారు అయ్యారా.. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడైన అమిత్ షా ఈ విషయాన్ని చెప్పారా.
అంటే అవును అంటున్నారు ఈ రోజుల్లో ఫేం సినీ నటి రేష్మా రాథోడ్ . ఆమె మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తనకు అవకాశమిస్తే బీజేపీ పార్టీ తరపున మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతాను అని ఆమె తెలిపారు ..ప్రస్తుతం ఆమె బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా పదవీ
బాధ్యతలు నిర్వహిస్తున్నారు..