శ్రీరెడ్డి, ఇటీవల కాలంలో టాలీవుడ్లో వైరల్‌గా మారిన నటి. రోజుకో సెన్షేషన్‌ను రివీల్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అంతేకాకుండా, టాలీవుడ్లో తెలుగు యువతులపై జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ వేధింపులను ఇప్పటికైనా ఆగేలా సినీ యూనియన్లన్నీ ఏకం కావాలని ఇటీవల స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు, బఢా ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్‌బాబు తనయుడు తనను ప్రేమ పేరుతో లైంగికంగా వాడుకొని వదిలేశాడని మీడియా ముఖంగా చెప్పింది. వారి మధ్య జరిగిన వ్యవహారాలకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా విడుదల చేసి సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది.
అలా తనను వాడుకున్న వారందరిని వదలబోనని శపథం చేసింది శ్రీరెడ్డి. అయితే, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి మాట్లాడుతూ.. నన్ను చావుదెబ్బ కొట్టి, అవమానపరిచిన ఏ ఒక్కరిని వదలను. నేను ద్రౌపది లాంటి దాన్ని, ఆవిడకు ఐదుగురు భర్తలే కావొచ్చు. కానీ నాకు మాత్రం అంతకు మించి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కౌరవ మహాసభలో ద్రౌపది తనకు జరిగిన అవమానాన్ని గురించి మాట్లాడుతూ.. నన్ను నిండు మహాసభలో అవమానించిన వారిని తమ భర్తులు చంపిన తరువాతనే. నా జుట్టు కొప్పును ముడేసుకుంటా.. అంటూ ద్రౌపది శపథాన్ని గుర్తు చేసింది. ద్రౌపది లానే.. నేను కూడా నా ప్రతీకారాన్ని తీర్చుకుంటానంటూ శ్రీరెడ్డి ప్రతిజ్ఞ చేసింది.