సులభతర వాణిజ్యంలో ఏపీ రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో నిలిచిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తెలుగువారై ఉండి ఏపీకి మొదటి స్థానం వస్తే కొందరు కడుపు మంటతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోకి 10 మొబైల్‌ఫోన్ల తయారీ కంపెనీలు వస్తే.. ఏపీకి రెండు వచ్చాయన్నారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పాదయాత్రతో పాదయాత్రకు ఉన్న పవిత్రత పోయిందని విమర్శించారు. ఆయన చేసేది పాదయాత్ర కాదని, క్యాట్‌వాక్ అని మంత్రి ఎద్దేవా చేశారు. పోలవరంలో అవినీతి జరిగిందని బీజేపీ, వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం పనులు బాగా జరుగుతున్నాయని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించారని సోమిరెడ్డి అన్నారు.
