కొన్నిసార్లు ఎంతో పక్కాగా ప్లాన్ చేసుకున్నా లాస్ట్‌మినిట్‌లో ప్లాన్ రివర్స్ అవుతుంది. ప్రస్తుతం సైరా యూనిట్ పరిస్థితి అలానే ఉంది. 40 రోజుల షెడ్యూల్‌కు ప్లాన్ చేశారు. కొన్ని రోజులు అలానే ముందుకు వెళ్లారు. కానీ, ఆ తరువాత ఊహించని సమస్య వచ్చిపడింది. దీంతో తారాగణం సెట్ వరకు వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారు.
ఇక అసలు విషయానికొస్తే..వర్షం వల్ల చిరు ప్లాన్ అంతా డిస్టర్బ్ అవుతోంది. మరో వైపు మిగతా స్టార్స్ డేట్స్ కూడా వేస్ట్ అవుతున్నాయి. కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో సైరా షూటింగ్ సాగుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు సురేందర్‌రెడ్డి చిరుతోపాటు మరికొందరు స్టార్ష్‌తో భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశాడు. నిన్నా.. మొన్నటి వరకు షూటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది ఏర్పడలేదు. కానీ, ఇప్పుడు వరుసగా కురుస్తున్న వర్షాలతో సైరా షూటింగ్‌కు బ్రేక్ పడుతోంది.
ప్రస్తుతం సైరా నైట్ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. చిరంజీవి కూడా రాత్రి సమయాల్లో సెట్స్‌లోనే గడుపుతున్నాడట. రీసెంట్‌గా సెట్‌లోకి అడుగుపెట్టాడు శాండిల్‌వుడ్ స్టార్ సుదీప్. సుదీప్, చిరంజీవిలపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉండగా వర్షం వల్ల వీరిద్దరూ సెట్ వరకు వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారట. రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సైరా 2019లో విడుదల కానుంది.