ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 212 రోజుకు చేరుకుంది. కాగా, జగన్ తన పాదయాత్రను తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు వైఎస్ జగన్ను కలిసి చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రను దృష్టిలో పెట్టుకుని ఇటీవల కాలంలో పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని, అందుకు, చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న నీటిపారుదల ప్రాజెక్టుల్లో, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో టీడీపీ నేతలు పాల్పడుతున్న అవినీతి, కుంభకోణాలే కారణమని ఆ సర్వేలు తేల్చి చెప్పాయి. దీనికి అనుగుణంగా, ఇటీవల కాగ్ విడుదల చేసిన నివేదికలో చంద్రబాబు సర్కార్ అవినీతిని లెక్కలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇలా, చంద్రబాబు సర్కార్ అవినీతి, కుంభకోణాలు ఒక్కొక్కటిగావెలుగు చూస్తున్నాయి. అంతేకాక, ప్రత్యేక హోదా సాధించే బాధ్యత నాది అంటూ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను నమ్మించి..ఓట్లు దండుకుని.. సీఎం పీఠం అధిరోహించిన చంద్రబాబు.. తీరా అధికారం చేపట్టాక ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీనే ముద్దు అంటూ మీడియా సాక్షిగా సీఎం చంద్రబాబు నినాదం చేసిన విషయం తెలిసిందే. ఇలా, చంద్రబాబు తన చర్యలతో 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ప్రధాన కారణం కాబోతున్నారంటూ సర్వే సంస్థలు వెల్లడించడం గమనార్హం.
ఇలా, ఎన్నికల సర్వే సంస్థల ఫలితాలన్నీ వైసీపీ వైపు మొగ్గు చూపుతూ ఫలితాలను ప్రకటించడంతో.. ఆ ఫలితాలను పరిగణలోకి తీసుకున్న సీనియర్ రాజకీయ నేతలు ఇప్పటికే కొందరు వైసీపీలో చేరగా.. మరికొందరు జగన్ పాదయాత్ర పూర్తయ్యేలోగా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా, ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా పాదయాత్ర చేస్తున్న జగన్ సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ తేతలి రామారెడ్డికి వైసీపీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.