హైదరాబాద్ మహానగరంలో బయట సన్నగా వర్షం పడుతోంది. నగర వాసులు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. సరిగ్గా అప్పుడే అబిడ్స్ రోడ్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ టెలిఫోన్ ఎక్సెంజ్ వద్ద రోడ్డు పక్కనే ‘ ఓ వింత దృశ్యం. ఓ యువతి, యువకుడు శుక్రవారం మద్యం తాగుతూ, గంజాయి పీలుస్తున్న సన్నివేశం కెమెరా కంటపడింది. ఎవరేమనుకుంటే తమకేంటి అన్నట్టుగా వారిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ‘చుక్కే’శారు. మూసి ఉన్న దుకాణం ముందు తాపీగా కూర్చుకుని మందు మజాతో విందు చేసుకున్నారు. మత్తు సరిపోలేదో, కిక్ ఇంకా కావాలనుకున్నారో తెలియదు కానీ మద్యానికి గంజాయి, సిగరెట్ జత చేసుకున్నారు. లోకమంతా మరిచి మత్తులో మునిగి తేలారు. పబ్లిగ్గా మందేస్తున్న చుక్క, చక్కనోడిని చూసి ఆ దారిన పోయే వారంతా చకితులై నోళ్లు వెళ్లబెట్టారు. ఇదేం చోద్యమంటూ గుసగుసలాడారు. గ‘మ్మత్తు’ అంటే ఇదేనేమో!