తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంకలో శనివారం మధ్యాహ్నం పడవ బోల్తా పడిన ఘటన పలువురిని విషాదంలో నింపిన సంగతి తెలిసిందే. పడవలో స్థాయికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటం వల్లే బోల్తా పడినట్లు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పడవలో 30 మంది ఉన్నట్లు చెబుతున్నారు. పడవ బోల్తా పడిన విషయాన్ని ఒడ్డు నుంచి గమనించిన పశువుల్లంక గ్రామస్తులు వెంటనే మరికొన్ని పడవలతో స్పాట్ కు వెళ్లారు. 10 మందిని నదిలో నుంచి ఒడ్డుకి తీసుకొచ్చారు. మరో 10 మంది ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. మిగిలిన 10 మంది గల్లంతు అయినట్లు చెబుతున్నారు
కాగా, పడవప్రమాదంలో గల్లంతైనట్లుగా అనుమానిస్తున్నవారిపేర్లు
1. కొండేపూడి రమ్య -10 వ తరగతి
2. పోలిశెట్టి వీర మనీష- 10వ తరగతి
3. సుంకర శ్రీజ – 4 వ తరగతి
4. సిరికోటి ప్రియ – 8 వ తరగతి
5. పోలిశెట్టి అనూష – 9 వ తరగతి
6. పోలిశెట్టి సుచిత్ర – 6వ తరగతి
అందరూ పశువులలంక పాఠశాలలో చదువుతున్నారు
అందరూ శేరిలంక, కే. గంగవరం, పామర్ల మండలానికి చెందిన వారిగా అనుమానిస్తున్నారు
* గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి
* ఇప్పటికే సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎన్‌డీఆర్ ఎఫ్ దళాలు
* విశాఖపట్నం నుంచి సంఘటన స్థలానికి బయలుదేరిన నావికా దళ బృందాలు
వాస్తవానికి రెండో శనివారం కారణంగా ఈ రోజు స్కూల్ పిల్లలకి సెలవు. వనం మనం ( ప్రభుత్వ కార్యక్రమం ) కార్యక్రమం కోసం సెలవు రద్దు చేసి పిల్లలతో మొక్కలు నాటించారు. అదే వారి ప్రాణాలు తీసిందని పలువురు ఆరోపిస్తున్నారు.
Tags boat accident