దేశంలో గుణాత్మక రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ ముందడుగుతో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పటికే పలు పార్టీల నేతలతో సమావేవం అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు తగిన కసరత్తు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో చర్చించిన సీఎం.. తదుపరి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే. తమిళనాడు రాజధాని చెన్నైకి వెళ్లి, డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో సమావేశం అయ్యారు.
తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఇలాంగోవన్ శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. ఆగస్టు 30న చెన్నయ్ లో నిర్వహించే ‘రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి – ఫెడరలిజం’ అనే అంశంపై నిర్వహించే సదస్సుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానిస్తూ డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ రాసిన లేఖను అందించారు.