వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం 212వ రోజు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కొనసాగుతోంది. కొనసాగిస్తున్నారు. అన్ని వర్గాలు ప్రజలు వైఎస్ జగన్‌ను కలిసి వారి వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. 15 నెలలుగా తమకు జీతాలు ఇవ్వకుండా.. చంద్రబాబు సర్కార్ వేధింపులకు గురి చేస్తుందని ఆయుష్ ఉద్యోగులు, పారామెడికల్ సిబ్బంది, లైసెన్సులు మంజూరు చేయాలని డాక్యుమెంట్ రైటర్స్, ఇళ్ల పట్టాలు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు స్థలాలు చూపలేదని లబ్ధిదారులు, పుష్కర ఎత్తిపోతల నుంచి సాగునీరు అందేలా చూడాలని రైతులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు వైఎస్ జగన్‌తో తమ గోడు చెప్పుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, ప్రజా సంకల్పయాత్రపై తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయంపై ఓ మీడియా ఛానెల్ ఆ ప్రాంత ప్రజల అభిప్రాయాలను సేకరించింది. అయితే, బిక్కవోలు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా..! ఎవరు ప్రలోభపెట్టినా..! వైఎస్ జగన్‌కే మా ఓటు.. అని చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమన్నా ఉంటుందా..? అని యాంకర్ ప్రశ్నించగా.. చిరంజీవిలానే .. పవన్ పరిస్థితి కూడా అని, వాళ్లు ఎంత డబ్బు ఇచ్చినా.. తీసుకుని.. జగన్‌కే ఓటు వేస్తామని చెప్పారు.