కేంద్రమంత్రి రాందాస్ ఆథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమీ నుండి వైదొలగి టీడీపీ పార్టీ చాలా పెద్ద తప్పు చేసింది.నాలుగేళ్ళు ఓపిక పట్టిన టీడీపీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరికొన్ని రోజులు ఓపిక పట్టకలేకపోయారు.
ఇప్పుడు కాకపోయిన ఎప్పుడైన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ ఇచ్చేది తమ పార్టీనే.అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని తమ కూటమీలోకి ఆహ్వనిస్తున్నాం..దేశ రాజధాని ఢిల్లీ వెళ్ళిన తర్వాత ప్రధాన మంత్రి నరేందర్ మోదీ,మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో మాట్లాడ్తాను అని ఆయన అన్నారు .గత కొన్నాళ్ళుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు విశేష ఆదరణ లభిస్తుంది.ప్రస్తుతం టీడీపీ సర్కారుపై నెలకొన్న తీవ్ర వ్యతిరేకత వలన వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నట్లు ఉంది.పలు సర్వేలు కూడా అదే విషయాని తేలుస్తుంది..ప్రస్తుతం జగన్ కు వస్తున్న విశేష ఆదరణను బట్టి జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు .
