ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరి నదిలో నాటు పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో ముప్పై మంది గల్లంతైయ్యారు. తలారివారిపాలెం లంక నుంచి పశువుల్లంకకు బయల్దేరిన నాటు పడవలో సుమారు 40 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల్లో ఎక్కువగా విద్యార్థులే ఉన్నరు.
