ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేసిన ఆనం రామనారాయణ రెడ్డి ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిశారు. తన సోదరుడు దివంగత ఆనం వివేకానందరెడ్డి తనయుడు రంగమయూరిరెడ్డితో కల్సి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ నివాసంలో ఆనం కలిశారు.
దాదాపు గంటపాటు జగన్ తో భేటీ అయ్యారు.అయితే గత కొంత కాలంగా ఆనం వైసీపీలో చేరతారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే..ఈ సమావేశంలో ఆనం వైసీపీలో చేరిక విషయం గురించి..రానున్న ఎన్నికల్లో ఆనం బరిలోకి దిగే స్థానం గురించి ప్రస్తావన వచ్చినట్లు సమాచారం..