కర్నూల్ జిల్లాలోని ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హవా వీపరీతంగా పెరుగుతుంది. రోజు రోజుకు ..అంతకు ..అంత పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. దీనికి కారణం ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ పాలన పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం. మరోపక్క జగన్ నమ్మకం కుదరడం. దీంతో జిల్లాలో భారీగా వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. ఇటీవలనే జిల్లాకు చెందిన రిటైర్డ్ ఐజీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ వైసీపీలో చేరారు. తాజాగా సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన గ్రూప్–1 రిటైర్డ్ అధికారి నరసింహం.. గురువారం వైసీపీ పార్టీలో చేరారు. కోవెలకుంట్లలోని వీఆర్, ఎన్‌ఆర్ పంక్షన్ హాలులో నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ కోవెలకుంట్ల మండల బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు రిటైర్డ్ జాయింట్ కమిషనర్(స్టేట్ ట్యాక్స్) నరసింహం.. కాటసాని సమక్షంలో వైసీపీలో చేరారు. 1996 గ్రూప్–1 బ్యాచ్‌కు చెందిన నరసింహం.. కడప, అనంతపురం జిల్లాల్లో పనిచేశారు.కడప జిల్లాలోని విజిలెన్స్‌అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో పనిచేస్తూ ఇటీవల పదవీ విరమణ పొందారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ న్యాయకత్వం అవసరమన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఐదు కోట్ల మంది ప్రజలు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 30 లక్షల మంది నిరుద్యోగులకు భృతి కింద ఏడాదికి రూ. 1500 కోట్ల చెల్లించాల్సి ఉందన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పుల ఊబిలో కూరకపోయారన్నారు. వైఎస్సార్ పాలన సువర్ణ యుగమని, మళ్లీ అలాంటి పాలన రావాలంటే వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ తో సాధ్యమవుతుందన్నారు. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలతో ప్రజలకు అన్ని విధాలా మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, సీనియర్ డాక్టర్ రామిరెడ్డి, కోవెలకుంట్ల, బిజనవేముల ఎంపీటీసీ సభ్యులు భీమిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, దిల్క్‌బాష, వెలగటూరు, సౌదరదిన్నె సర్పంచ్‌లు ఎల్వీ సుధాకర్‌రెడ్డి, రమణారెడ్డి, సిద్ధంరెడ్డి రాంమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.