వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్నారుల నుంచి నిరుద్యోగుల వరకు వారి వారి సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులైతే తాము వెళ్లే పాఠశాలల గదులు బాగా లేవని, రైతులు, డ్వాక్రా మహిళలైతే రుణమాఫీ చేస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ ఇంకా అమలు కాలేదని జగన్‌తో చెప్పుకుంటున్నారు. అలాగే, ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌నుకూడా చంద్రబాబు సర్కార్ విడుదల చేయలేదని నిరుద్యోగులు జగన్‌కు అర్జీల రూపంలో తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉండగా, గురువారం జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న జగన్‌ను ఓ మహిళ కలిసింది.అందరిలానే జగన్‌తో కాసేపు మాట్లాడి.. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు చెప్పుకుంది. ఆ తరువాత అందరిలానే జగన్‌తో సెల్ఫీ దిగింది. అనంతరం తన వెంట తెచ్చిన టెంకాయతో .. వైఎస్ జగన్‌కు దిష్టి తీసింది. అధికార, వైసీపీయేతర పార్టీ నేతల దిష్టి కాబోయే సీఎంకు తగలకూడదని పలుకుతూ తన వెంట తెచ్చిన టెంకాయతో జగన్‌కు దిష్టి తీసింది.