మూడు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో ఇంగ్లండ్ పైటీమిండియా ఘన విజయం సాధించింది.ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన వన్డేలో 8 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది . 40 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది భారత్. ఓపెనర్ రోహిత్ శర్మ 137 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 75 పరుగులు, శిఖర్ ధావన్ 40 పరుగులు చేసి స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు. దాంతో మరో పది ఓవర్లు మిగిలుండగానే టార్గెట్ చేధించింది టీమిండియా.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 268 పరుగులు చేసి మరో బంతి మిగిలుండగానే ఆలౌట్ అయింది. కాగా భారత్. లార్డ్స్ వేదికగా లండన్ లో రేపు రెండో వన్డే జరగనుంది.
