`అస్సాం, త్రిపుర, హర్యానాలో గెలిచిన విధంగానే తెలంగాణలో పార్టీ అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు…అమిత్ షా వ్యూహం, మోడీ నాయకత్వంతో ముందుకు పోతాం. తెలంగాణలో అధికారం మాదే`ఇది నోరు తెరిస్తే బీజేపీ నేతలు చేసే ప్రచారం. అయితే ఆచరణలో అంత సీనేమీ లేదని స్పష్టమవుతోంది. ఏకంగా తెలంగాణ బీజేపీ నేతలు ఇచ్చిన సమాచారంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అవాక్కయ్యారని ప్రచారం జరుగుతోంది.
రేపు అమిత్ షా బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి పార్టీ కార్యాలయానికి రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ అమిత్ షా పర్యటన తర్వాత విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తామని.. కార్యకర్తల్లో ఉత్సాహం, పార్టీకి మనోబలాన్ని సమకూరుస్తామని అమిత్ షా వివరించారు. యాత్ర ద్వారా
ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని తెలిసిందన్నారు. ఇప్పుడు ప్రత్యామ్నాయం మేమే అనే నమ్మకం ప్రజల్లో కలిగించామని వెల్లడించారు.
బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి, ఎందరో నాయకులు మా పార్టీలోకి రానున్నారని చేసిన ప్రకటనల సంగతి ఏంటని మీడియా ప్రశ్నించగా ఎవరూ చేరడం లేదు అనే విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పకుండా..` మాతో ఎవరూ చర్చించడం లేదు. మోడీ విధానాలు, అమిత్‌షా నాయకత్వం నచ్చిన వారు పార్టీలో చేరవచ్చు` అంటూ ముగించారు. తద్వారా తమ పార్టీ వైపు
ఎవరూ చూడటం లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పారని అంటున్నారు.