స్పైడర్ తరువాత మళ్లీ కనిపించలేదు రకుల్. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయని ప్రచారం ప్రారంభమైంది. రకుల్ కావాలనే కోలీవుడ్ షిప్ట్ అయిందని ఒకసారి, బాలీవుడ్ నుంచి వస్తున్న ఆఫర్స్ కారణమని మరోసారి రూమర్స్ పుట్టుకొచ్చాయి. అయితే, ఇవన్నీ కేవలం రూమర్లేనని తేలిపోయాయి. దీనికంతటికీ కారణం రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ టాలీవుడ్లో బిజీ కావడమే.
కొంతకాలం గ్యాప్ తరువాత మళ్లీ టాలీవుడ్‌పై దృష్టి పెట్టింది రకుల్. కోలీవుడ్‌లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ పొడుగు కాళ్ల సుందరి వెంకీ మామా మూవీలో నాగచైతన్య సరసన నటిస్తుంది. గతంలో వీరిద్దరూ రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంలో కలిసి కనిపించారు. ప్రముఖ దర్శకుడు బాబి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.
మరో వైపు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతోంది. ఇప్పుడు లేటెస్ట్గా ఎన్టీఆర్ బయోపిక్‌లోనూ ఓ ముఖ్య పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్‌ను సంప్రదించినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో రకుల్‌కు ఏ పాత్రను ఆఫర్ చేస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.