నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో కీలక సమస్యకు తెరపడింది. బోధన్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస రాజకీయానికి నెలకొన్న ఉత్కంఠకు శుభం కార్డు పడింది. బోధన్‌లో అసంతృప్తితో ఉన్న మజ్లిస్, టిఆర్ఎస్ కౌన్సిలర్లు శాంతించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మజ్లిస్ కౌన్సిలర్ల తో కలిసి ఎంపీ కవితతో భేటీ అవడంతో పరిణామం చోటుచేసుకుంది.
బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్,టీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి ఎంపీ కవిత అసదుద్దీన్‌తో సమావేశమయ్యారు. చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్యపై ఇచ్చిన అవిశ్వాస నోటీసు ఉపసంహరించుకుంటామని ఎంపి కవితకు కౌన్సిలర్లు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత సైతం కౌన్సిలర్లను ప్రశంసించారు. సమన్వయంగా పనిచేసి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని ఆమె సూచించారు.