యువనాయకుడు జూపల్లి అరుణ్ ఇవాళ కొల్లాపూర్ పట్టణం సోమశిలలోని కృష్ణానది పరివాహక ప్రాంత ఒడ్డున నిర్మాణంలో ఉన్న ఆధునిక వసతి గృహాల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం నదిలో ప్రస్తుత నీటి మట్టం, జూరాల నుండి వచ్చే వరద ప్రవాహం గురించి స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. కొల్లాపూర్ పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలను సందర్శించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వర్షాకాలంలో స్టేడియం నుండి వరద నీరు కళాశాల ఆవరణలోకి వచ్చి బురదమయంగా అవుతుందని, కళాశాలలోని చిన్న చిన్న సమస్యలను విద్యార్థినులు అరుణ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి కళాశాల ఆవరణలో నీరు నిలవకుండా మొఱ్ఱముతో చదును చెయ్యాలని నాయకులకు సూచించారు. పట్టణ మునిసిపల్ కమిషనర్ తో శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవలసిందిగా కోరడం జరిగింది. అలాగే SC గురుకుల పాఠశాలలో విద్యార్థినులు ఆడుకోవడానికి 20,000/- రూపాయలతో క్రీడా సామగ్రిని వితరణ చేస్తానని అరుణ్ హామీ ఇవ్వడం జరిగింది.
ఈ పర్యటనలో భాగంగా జడ్పీటీసి హనుమంత నాయక్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇక్బాల్, మాజీ ఎంపీపీ నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు నరసింహ రావు, సోమశిల సర్పంచ్ వెంకటస్వామి, యువ నాయకులు రహీం, బొరెల్లి మహేష్, TRSV నాయకులు పాల్గొన్నారు.