హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణం విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుండి ప్రారంభమయ్యే మెట్రో రైలు సర్వీసులు సోమవారం నుండి శనివారం వరకు ఆరున్నర గంటలకు నడపనున్నారు. ఉదయం 6 గంటల నుండి ప్రారంభమయ్యే రైలు సర్వీసులు ఆదివారం రోజు ఏడు గంటల నుండి నడపనున్నారు.
కాగా, అమీర్‌పేట్–ఎల్బీనగర్ రూట్లో ఆగస్టులో మెట్రో రైళ్లు పరుగులు తీయనున్న సంగతి తెలిసిందే. మెట్రో ప్రయాణికులకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ వరకు సౌకర్యవంతమైన ప్రయాణం సాకారం చేసేందుకు మెట్రోస్టేషన్ల వద్ద ద్విచక్ర వాహనాలతో పాటు కార్లను అందుబాటులో ఉంచుబోతున్నారు. మెట్రో స్టేషన్ల వద్ద నూతనంగా ప్రవేశపెట్టిన ‘డ్రైవ్ జీ’ యాక్టివా వాహనాలను ఇటీవలే ప్రారంభించారు.
మరోవైపు మెట్రో మొదటి దశలో మెట్రోలో భాగంగా మియాపూర్ నుంచి అమీర్‌పేట, అమీర్‌పేట నుంచి నాగోల్ వరకు పట్టణ పునఃనిర్మాణం పేరుతో రూ.100కోట్లు వెచ్చించి ఫుట్‌పాత్‌లను ఆధునీకరించారు. రూ.5కోట్లతో హైటెక్ సిటీ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం.36 వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. త్వరలో అందుబాటులోకి రానున్న మెట్రో కారిడార్‌ల్లోనూ ఈ తరహా నిర్మాణాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.