తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని నానక్‌రాం గూడాలో భారీ పేలుడు సంభవించింది.నిర్మాణంలో ఉన్న ఫీనిక్స్ టవర్స్ భవనంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమమలోనే విషయం తెలుసుకున్నస్థానిక పోలీసులు వెంటనే అక్కడికెళ్లారు. విలేకర్లతోపాటు ఎవరినీ ఆ ప్రాంతానికి అనుమతించడం లేదు. నిల్వ ఉంచిన పేలుడు పదార్థం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, లోపల మనుమతించడం లేదు. మరిన్ని పేలుళ్లు జరిగే ప్రమాదం ఉందని పోలీసులు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.