అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మరీనా విజయ్ దేవరకొండ తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం ‘గీత గోవిందం’. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన యాక్ట్ చేస్తుంది .ఈ క్రమంలోనే ఈ చిత్రంలోని ‘ఇంకేం ఇకేం కావాలే’ అనే పాటను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. ఈ పాటకు యూత్ నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పాట వినపడుతుంది. ఈ పాట వింటూ యూత్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఓ 15 నెలల బుడ్డోడు కూడా ఈ పాటను తదేకంగా చూస్తూ విజయ్‌ని బోల్డంత సంతోషపెట్టాడు.
My 15 month old son loving this. He cries if we pause. #littleguy #bigfan pic.twitter.com/XnlNYqjsJr
— Ramu (@mekrreddy) July 12, 2018
రామ్ అనే నెటిజన్ దీనికి సంబంధించిన ఓ వీడియోను విజయ్ దేవరకొండ కు ట్విటర్లో పోస్టు చేస్తూ..‘నా 15 నెలల కొడుక్కి ఈ పాట అంటే చాలా ఇష్టం. ఒకవేళ పాటను మధ్యలో ఆపేస్తే ఏడ్చేస్తాడు. మీకు వీడు వీరాభిమాని సర్’ అని రామ్ పోస్ట్ చేసాడు .అయితే ఈ ట్వీట్ కు వెంటనే విజయ్ స్పందిస్తూ.. ‘ఉదయం లేవగానే ఈ వీడియో చూశాను. సర్.. ఒకవేళ మీరు హైదరాబాద్‌లోనే ఉంటే నా పెద్ద అభిమానిని ‘గీత గోవిందం’ సెట్స్‌కు తీసుకురండి. అప్పుడు నన్ను, మా మేడమ్ గీతను చూడొచ్చు’ అని విజయ్ ఫన్నీ గా ట్వీట్ చేశారు.
Rowdiesss 🙂
Over night 1M. Danchude!
Madammm – chudandi, maa batch antha feel avtunnaru. #InkemInkemInkemKaavaale thalli? @iamRashmikahttps://t.co/6im5S9TEPG pic.twitter.com/djcMrRQ2cP— Vijay Deverakonda (@TheDeverakonda) July 11, 2018