Home / POLITICS / హైద‌రాబాద్‌లో డిఫెన్స్ ఇంక్యుబేట‌ర్ ఏర్పాటుకు కేంద్రం ఓకే

హైద‌రాబాద్‌లో డిఫెన్స్ ఇంక్యుబేట‌ర్ ఏర్పాటుకు కేంద్రం ఓకే

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ మ‌రో గుర్తింపును సంత‌రించుకోనుంది. హైదరాబాదులో డిఫెన్స్ ఇంకు బెటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రక్షణ ఎకో సిస్టమ్‌నుదృష్టిలో పెట్టుకొని ఇక్కడ డిఫెన్స్ ఇంకుబేటర్‌ను  ఏర్పాటు చేయాలని గతంలో రక్షణశాఖకు మంత్రి కేటీ రామారావు లేఖ రాశారు. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మల సీతారామన్ నుంచి టీ హబ్ కేంద్రంగా డిఫెన్స్ ఇంక్యుబేటర్ ఏర్పాటు చేసేందుకు సానుకూలంగా స్పందించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (iDex) అనే పథకంలో భాగంగా డిఫెన్స్ ఇంక్యుబేటర్ ను ఏర్పాటు చేసేందుకు సానుకూలంగా ఉన్నామని మంత్రి కేటీ రామారావుకు ర‌క్ష‌ణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ పథకంలో భాగంగా రక్షణ రంగం, ఏరోస్పేస్ రంగంలోని పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ, స్టార్ట్ అప్స్, మరియు వ్యక్తిగతంగా ఆయా రంగాల్లో పరిశోధన చేస్తున్నటువంటి పరిశోధకులకు,  పరిశోధనా సంస్థలకు, విద్యార్థులకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు సమకూర్చే టువంటి అవకాశం ఉంటుందని నిర్మల సీతారామన్ తెలిపారు.

టీ హబ్ కేంద్రంగా ఇంక్యుబేటర్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినందుకు మంత్రి కేటీ రామారావు హర్షం వ్యక్తం చేశారు. అనేక దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంలో రక్షణ మరియు ఏరోస్పేస్ రంగంలో అనేక సంస్థలు చేస్తున్నాయని, ముఖ్యంగా డీఆర్‌డీఓతో పాటు మరో పది రక్షణ ప్రభుత్వరంగ సంస్థలు, 25 ప్రవేట్ సెక్టార్లోని తయారీదారులు, సుమారు వెయ్యికి పైగా రక్షణ రంగ ఎమ్మెస్ ఎం ఈ లుహైదరాబాద్ నగరంలో కొలువై ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రక్షణ మరియు ఏరోస్పేస్ రంగాలకు అత్యంత ప్రాముఖ్యత రంగంగా గుర్తించిందని, ఈ మేరకు హైదరాబాదుకి అనేక నూతన పెట్టుబడులను ఆకర్షించడంలో విజయవంతమైనదన్న

మంత్రి… ఇక్కడ రక్షణ శాఖ డిఫెన్స్ ఇంక్యుబేటర్ ను ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఈకో సిస్టం మరింత బలోపేతం అవుతుందన్నారు. ఇప్పటికే దేశంలోని అతిపెద్ద ఇంక్యుబేటర్ గా ఉన్నటువంటి టి హబ్ కేంద్రంగా రక్షణ శాఖ డిఫెన్స్ ఇంకుబేషన్ ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కేటీ రామారావు ఈ సందర్భంగా తెలిపారు.

రానున్న టీహబ్ రెండవ దశ భవనంలో ప్రత్యేకంగా రక్షణ ఇంక్యుబేటర్ స్థలాన్ని కేటాయించడంతోపాటు డిఫెన్స్ రంగంలోని పరిశోధనలకు ప్రోటో టైపింగ్, టెస్టింగ్ ఇంకుబేషన్ స్కేల్ మరియు నైపుణ్య శిక్షణ సేవలను అందించేందుకుఇంక్యుబేటర్ కేంద్రంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. హైదరాబాద్లో రానున్న డిఫెన్స్ ఇంక్యుబేటర్ ద్వారా ఇక్కడి పరిశోధనలకు మరింత ఊతం దొరికినట్లు అవుతుందని మంత్రి కేటీ రామారావు సంతోషం వ్యక్తం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat