సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా పరిపాలన సాగిస్తూ అన్నివర్గాల మనసు గెలుచుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ బాహుబలిగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఆయన పరిపాలనతో తమ ఉనికి కనుమరుగై పోతోందని ఆవేదన చెందుతున్న పార్టీలు ఎన్నో. అలా భావిస్తున్న వాటిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి. అయితే,ఈ విషయాన్ని
ఒప్పుకోలేని కాంగ్రెస్ పార్టీ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది. అయితే, ఈ ప్రచారం ద్వారా కాంగ్రెస్ పార్టీయే కామెడీ పాలవుతోందని చర్చ జరుగుతోంది.
జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయా పార్టీ అభిప్రాయాలను స్వీకరిస్తున్న నేపథ్యంలో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పార్టీగా టీఆర్ఎస్ సైతం తన అభిప్రాయం వినిపించింది. జమిలికి తాము సిద్ధమని తెలిపింది. అంతేకాకుండా ముందస్తు వచ్చిన ఓకే అంటూ పార్టీ రథసారథి కేసీఆర్ ప్రకటిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు ఎదుర్కునే సత్తా లేదనే విషయం తెలిసిన సంగతే.
ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయించాలని ఎత్తుగడతో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆ పార్టీ విమర్శలు చేయగా..అవికాస్తా బూమరాంగ్ అయ్యాయంటున్నారు. ఇంతకీ కాంగ్రెస్ ఏమంటోందంటే…“బీజేపీతో కేసీఆర్ దోస్తీ చేస్తున్నారు కాబట్టే ముందస్తుకైనా..జమిలి ఎన్నికలకైనా ఓకే అంటున్నారు` అని ఆరోపిస్తోంది. అయితే, తమ గెలుపుపై భరోసా, అన్నివర్గాల
అండాదండా లేనిదే ముందస్తుకైనా..ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకైనా టీఆర్ఎస్ ఎలా సై అంటుందనే లాజిక్‌ను కాంగ్రెస్ మర్చిపోయి నవ్వుల పాలు అయిందని చర్చ జరుగుతోంది.