‘మంచి-చెడు’ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్‌లు హద్దులు మీరారు. ఒకరిపై ఒకరు పడుతూ.. అరుచుకుంటూ.. గాయపరుచుకుంటూ.. హౌస్‌లోని వస్తువులను ధ్వంసం చేశారు. అయితే కౌశల్‌పై భానుశ్రీ చేసిన ఆరోపణలే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. గురువారం జరిగిన ఎపిసోడ్‌లో టాస్క్‌లో భాగంగా కౌశల్ తాకరాని చోట తాకాడని భాను తీవ్ర ఆరోపణలు చేసింది. భాను పట్టుకున్న యాపిల్స్ బయటకు కనపడటంతో కౌశల్ వాటిని బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో, భాను.. కౌశల్ చేతులు తన చెస్ట్‌కు తగిలాయంటూ రచ్చ చేసింది. తొలి నుంచి కౌశల్ అంటే గిట్టని తేజస్వీ ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ ‘వాడి బుద్ధే అంతా’ అంటూ విరుచుకుపడింది. ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న గీతామాధురి వెంటనే స్పందిస్తూ.. ‘ఆ ఆరోపణలు అవాస్తవం.. దయచేసి ఈ విషయాన్ని పెద్దగా చేయకండి’ అంటూ సొంత టీమ్ సభ్యులైన భాను, తేజస్వీలను హెచ్చరించింది. దీంతో కౌశల్ ఊపిరి పీల్చుకున్నాడు.
అయితే ఈ విషయాన్ని రచ్చ చేయాలని ప్రయత్నించారు. అయితే, కౌశల్ యాపిల్ తీసేప్పుడు అక్కడే ఉన్న గీతా మాధురీ.. వారిద్దరు చేస్తు్న్న ఆరోపణలను వ్యతిరేకించింది. కౌశల్ ఉద్దేశపూర్వకంగా భానును తాకలేదని, యాపిల్‌ను తీయడానికే ప్రయత్నించాడని గీతా తెలిపింది. ‘‘ఆటను ఆటలా ఆడండి. క్యారెక్టర్ల జోలికి వెళ్లొద్దు’’ అని తేజస్వీ, భానులకు క్లాస్ పీకింది గీతా. చివరికి భాను.. కౌశల్ తనను కావాలని తాకలేదని ఆమె వివరణ ఇచ్చుకోక తప్పలేదు. బిగ్‌బాస్‌కు కూడా భాను వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించింది. చివరికి భాను.. కౌశల్ వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పింది. గురువారం జరిగిన ఎపిసోడ్‌లో ప్రేక్షకుల సానుభూతి పొందాలనే కౌశల్‌పై భాను తీవ్ర ఆరోపణలు చేసిందని, కానీ ఆమె ప్రయత్నం విఫలమైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒక్క ఘటన.. భానుపై ఉన్న అభిమానాన్ని తుడిచివేసిందని కొందరు ఘాటుగానే కామెంట్లతో మండిపడుతున్నారు. ఈ సారి భాను ఎలిమినేషన్ పక్కా అని జోస్యం చెబుతున్నారు.కిరీటి చేసిన తప్పే భాను..
Serious fight between Bhanu, Teju & Kaushal #GoodAndBad ?#BiggBossTelugu2 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/qWfaSvSLcM
— STAR MAA (@StarMaa) July 12, 2018