ఏడాది క్రితం ప్రజా సమస్యలపై పాదయాత్ర చేయాలని వైఎస్ జగన్ సంకల్పించినప్పుడు ఎవ్వరూ పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. నడిస్తే ఓట్లు పడతాయా.?? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ విమర్శలు చేయడం ప్రారంభించారు. జగన్ పాదయాత్రకు తొలి రోజున భారీగా జనం వస్తే మొదటి రోజు కాబట్టి వచ్చారని పచ్చబ్యాచ్ ప్రచారం చేసింది. ఇప్పుడు పాదయాత్రకు 200లకు పైగా రోజులు గడిచాయి. ఏరోజుకారోజు జగన్‌ను చూసేందుకు ప్రజలు పెరుగుతున్నారే తప్ప తగ్గట్లేదు. అశేష ప్రజాభిమానం నడుమ కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా,..
కుంకుమ పువ్వు సీరియ్ ఆర్టిస్ట్ కృష్ణ కిశోర్ గురువారం ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని ఉలపల్లి గ్రామంలో వైఎస్ జగన్ వెంట నడిచారు. ప్రజలకు మంచి చేయాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారని కృష్ణ కిశోర్ అన్నారు. వైఎస్ జగన్‌తోనే ప్రజలకు మేలు జరుగుతుందన్న నమ్మకం తనకుందన్నారు. ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ వెంట అశేష సంఖ్యలో ప్రజలు నడుస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాపై, రైతులు, డ్వాక్రా మహిళలు, ఉద్యోగాల కల్పనపై ప్రజలను చైతన్య పరుస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే, తప్పనిసరిగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోయేలా పాలన కొనసాగిస్తాడన్న నమ్మకం తనకుందని కృష్ణ కిశోర్ అన్నారు. ఏపీలోని ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని, ప్రజలు కోరుకున్నట్టే 2019లో వైసీపీ అధికారంలోకి వస్తుంది.. వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు.. ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా పాలన కొనసాగిస్తారని కృష్ణ కిశోర్ చెప్పారు.