బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా అయన రాష్ట్ర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సరైన చర్యలు చేపట్టడం లేదంటూ అయన రాష్ట్ర నాయకులపై ఫైర్ అయ్యారు.
బూత్ కమిటీల నియామకంలో జాతీయ పార్టీ రూపొందించిన మార్గదర్శకాలతో కాకుండా సొంత ఎజెండాతో ఎందుకు వ్యవహరిస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. పార్టీ 23 మార్గదర్శకాలను పొందుపరచగా, రాష్ట్ర నేతలు 12 గైడ్‌లైన్స్‌కే వాటిని ఎందుకు కుదించారని ప్రశ్నించారు. రాబోయే నెలరోజుల్లోగా బూత్ కమిటీల ఏర్పాటును పూర్తిచేయాలని నేతలకు అయన ఆదేశించారు.ఒక నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లను ఏ, బీ, సీ, డీలుగా విభజించాలని సూచించారు.అంతే కాకుండా ప్రతి బూత్‌లో అయిదుగురు స్మార్ట్ ఫోన్లు కలిగిన వారిని,ఐదుగరు బైక్‌లు ఉన్న కార్యకర్తలను విధిగా గుర్తించాలని చెప్పారు .