ఈ నెల 4వ తేదీన వరంగల్ జిల్లా, కోటి లింగాల వద్ద జరిగిన భద్రకాళి ఫైర్ వర్క్స్ అగ్ని ప్రమాదంలో దురదృష్టవశాత్తు చనిపోయిన పది మంది కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించిన 5 లక్షల రూపాయలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు పట్టాలు అందించిన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేష్, కలెక్టర్లు ఆమ్రపాలి, హరిత, సీపీ రవీందర్, ఇతర అధికారులు.బాంబుల పేలుళ్ల వల్ల దెబ్బతిన్న చుట్టుపక్కల ఇళ్లలోని పేదలకు కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు పట్టాలు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి.
వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు 20 వేల నగదు అందించిన ఛాంబర్ ఆఫ్ కామెర్స్ ప్రతినిధులు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. మృతుల పెద్ద ఖర్మ నిమిత్తం అయ్యే ఖర్చులు భరించేందుకు ముందుకు వచ్చి, నగదు 20 వేలు అందించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ధన్యవాదాలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి.
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కామెంట్స్…
దురదృష్టవశాత్తు అగ్నిప్రమాదంలో పదిమంది చనిపోవడంతో వారి కుటుంబాలకు చాలా అన్యాయం జరిగింది. తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ప్రభుత్వం వీరికి పూర్తి అండగా ఉంటుంది. చనిపోయిన వ్యక్తుల కుటుంబంలోని పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. గాయపడిన వారికి ప్రభుత్వం తరపున చికిత్స అందిస్తున్నాం. ఈ ప్రమాదంలో గాయపడ్డ సురేష్ అనే వ్యక్తికి నిమ్స్ లో చికిత్స అందజేస్తున్నాం.