ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. ఈ సందర్బంగా ప్యాకేజీ 8 నుంచి కాలువ వరకు బయలుదేరే గ్రావిటీ కాలువను సందర్శించారు. వర్షాల వల్ల లైనింగ్ పనులు ఆగినయని ఇంజనీర్లు చెప్పారు.
కాలువలో నీటిని తోడి పనులు చేస్తున్నామని తెలిపారు. కాలువపై స్ట్రక్చర్లు ఈ నెలాఖరుకు పూర్తి అవుతాయని అన్నారు. గ్రావిటీ కాలువ వరద కాలువలో కలిసే ముందు ఉన్న రెగ్యులేటర్ పనులను పరిశీలించారు. ఇక్కడ గేట్ల బిగింపు పనులు ఆగస్టులో పూర్తి చేస్తామని అధికారులు మంత్రికి వివరించారు. పనులు మరింత వేగవంతం చేయాలని హరీశ్ రావు ఆదేశించారు. 5.70 కి మీ పొడవైన గ్రావిటీ కాలువ మట్టి పని మొత్తం అయ్యింది. లైనింగ్ లో 1.4 కి మీ మిగిలి ఉందని, 10 స్ట్రక్చర్స్ లో 5 పూర్తి అయినాయి మిగిలిన 5 ఈ నెలాఖరుకు పూర్తి అవుతాయని ఏజెన్సీ వారు మంత్రి కి వివరించారు.