గుడికి అందరూ వెళ్లొచ్చు. గుడిలో చోటు అందరికీ దొరుకుతుంది. కానీ, గర్భగుడిలో దేవుడికి మాత్రమే. ప్రజల గుండె కూడా గర్భగుడే. అయితే, అక్కడి చోటు ఎవరికి..? అమ్మలాగే.. మనందరికీ గుండెకు ఒక గర్భగుడి ఉంటుంది. ఆ గుండె గర్భంలో వెలిస్తే చాలు.. ప్రజల గర్భగుడిలో ఉన్నట్టే. అలా వెలిసిన మారాజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి.
అయితే, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ఇప్పటికీ ప్రజలు చర్చించుకుంటుంటారు. అంతేకాకుండా, ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే పేర్లు మార్చి.. ప్రజా సంక్షేమం పేరిట మళ్లీ ప్రవేశపెడుతున్నారు. ఆఖరకు ప్రధాని మోడీ సైతం ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం గురించి గుర్తు చేసిన విషయం తెలిసిందే. ఇలా వైఎస్ఆర్ ప్రజా నేతగా.. ప్రజల గుండెల్లో.. చిరస్థాయిగా నిలిచిపోయారు.
ఇదిలా ఉండగా, నశ శిశువు పుట్టగానే ఎవరైనా అమ్మ అని లేదా.. నాన్నఅనే మాటలు పలికిస్తారు. కానీ, ఓ బామ్మ.. తన మనవరాలికి వైఎస్ఆర్ అని పలికించింది. ఆ నవ శిశువు తో వైఎస్ఆర్ అని బామ్మ పలికిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.