గాడ్ సే కంటే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా ఘోరమైన వాడు.. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచి, అధికారంలో ఉండగానే టీడీపీ జెండాను లాక్కొన్నాడు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మళ్లీ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని ప్రజలను మోసం చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు.
కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేనేమన్నా కుంభకోణాలు చేశానా..? పాపం చేశానా..? లేక చంద్రబాబులాగా వెన్నుపోటు రాజకీయాలు చేశానా..? పార్టీకి మచ్చతెచ్చే పనులు ఏమన్నా చేశానా..? నన్నెందుకు టీడీపీ నుంచి బహిష్కరించారు అంటూ చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. నీవు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చిన సమయంలో.. నేను ఎన్టీఆర్ వెంటే ఉన్నా.. నీవు బతిమిలాడి నన్ను టీడీపీలోకి తీసుకున్నావు. నమ్మిన సిద్ధాంతాల కోసం కష్టించి పనిచేశా.. అటువంటి నన్ను ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్టే.. నన్ను కూడా మోసం చేశావు చంద్రబాబునుద్దేశించి అన్నారు మోత్కుపల్లి నర్సింహులు.