ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రూ.20 కోట్ల అవినీతి.. కేంద్రమంత్రి పర్యటనలో ఆధారాలతో సహా బయటపడింది. అవును, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పేరుతో పరోక్షంగా భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. అయితే, ఇటీవల కాలంలో నిర్మాణ వస్తువుల వ్యవయాలు పెరిగాయంటూ ఒక నివేదిక, భూ సేకరణ స్థలం విలువ 11 రెట్లు పెరిగిందంటూ మరో నివేదిక ఇలా రెండు విధాలుగా సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పేరుపై భారీ కుంభకోణానికి తెర తీశారు అంటూ ఓ సోషల్ మీడియా కథనం పేర్కొంది.
సోషల్ మీడియాలో ప్రచురితమైన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భూ సేకరణ మొత్తం విలువ రూ.2,900 కోట్లు. ఆ విలువే 2013 భూసేకరణ చట్టం ప్రకారం మూడు రెట్లు పెరిగింది. కానీ, చంద్రబాబు సర్కార్ మాత్రం ఆ విలువను 11 రెట్లు పెంచేసింది. పెరిగిన భూ సేకరణ విలువ ప్రకారం చంద్రబాబు సర్కార్ రూ.20 వేల కోట్ల భారీ కుంభకోణానికి తెరతీసిందన్న మాట.. అంటూ సోషల్ మీడియా కథనం పేర్కొంది.