పేదవాడి కడుపు నింపే ఉద్దేశంతో అన్న ఎన్టీఆర్ రెండు రూపాలయకే కిలో బియ్యం అందిస్తే ఇప్పుడు ఆయన పేరుతోనే టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్లు ప్రారంభించారు. అద్భుతమైన అలంకరణలతో, సీసీ కెమెరాల పర్యవేక్షణలతో , కార్పొరేట్ రెస్టారెంట్ల స్ధాయిలో.. క్లాస్ లుక్‌తో కనిపించేలా చేశారు.అయితే అన్నా క్యాంటీన్ పేరుతో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ అవినీతికి పాల్పడుతున్నది టీడీపీ ప్రభుత్వం అంటే విమర్శలు వస్తున్నాయి. ..
ప్రభుత్వం స్థలంలో బిల్డింగ్, ఇసుక ఫ్రీ..
తిప్పి తిప్పి కొలిచిన 80 చదరపుగజాలు వుండని స్థలం దాని నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానానుండి చెల్లించిన మొత్తం 38.50 లక్షలు.మహా అయితే 10 లక్షలు ఖర్చు చేసివుంటారు. మిగిలిన 28.50 లక్షలు గుటకాయస్వాహా..ఇక్కడ వడ్డీంచే భోజనానికి గరిష్టంగా లెక్కగట్టిన 25/- మించి వుండదు. అందులో తినేవారు 5/- చెల్లిస్తారు. వేరసి ఖర్చు 20/- రూపాయలు.
కానీ ప్రభుత్వం చెల్లిస్తున్నది ప్రజా ఖజానా నుండి 45/-రూపాయలు ప్లేటుకి. పోనీ ట్రాన్‌సుపోర్ట్‌కి 5/- తీసేసిన ప్లేటుకి 20/- అధనంగా చెల్లిస్తున్నారు. ఇందులో పెదబాబు చంద్రబాబు వాట ఎంత అంటూ ఒక్క రోజులోనే ఇలా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇలా పేదప్రజలకు అన్నం పెట్టేదాంట్లో కూడా రాష్ట్రఖజాన నుండి కన్నం వేస్తున్నారే గొప్ప దయార్ధహృదయులు మీరు అంటున్నారు వైసీపీ నేతలు. ఇదే తెలంగాణలో ప్రభుత్వం ప్లేటుకి 20/- రూపాయలు ప్రభుత్వ ఖజానానుండి చెల్లిస్తుందీ.ఏపీ ప్రభుత్వం మాత్రం ప్లేటుకి 45/- చెల్లిస్తున్నారు. ఇంతగా ఇందులో అవినీతి జరుగుతున్నా ఏపీలో టీడీపీ ఎన్నికల సమీపంలో అన్నం పెట్టి పబ్లిసిటీ చేసుకుంటున్నారనే ప్రచారం కూడ జరుగుతుంది